If You Want To Earn Assets, Do Like This – 3 – ఆస్తులను సంపాదించాలంటే ఇలా చేయండి!

పరిచయం

If You Want To Earn Assets, Do Like This – ఇప్పటివరకు మనం పాసివ్ ఇన్కమ్ ఎలా తయారు చేసుకోవాలి, మీ సొంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి అనే విషయాలను తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మీ వ్యాపారం నుండి మీకు లాభాల రూపంలో వచ్చే డబ్బును ఏం చేయాలో, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఏ ఏ ఆస్తులను కొనాలి?

If You Want To Earn Assets, Do Like This

మీ వ్యాపారం నుండి వచ్చే డబ్బును వృధా చేయకుండా ఆస్తులను కొనండి. ఇక్కడ చాలా రకాల ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు అంటే భూములు, ఇండ్లు, పాట్లు, అపార్ట్మెంట్లు – ఇవి స్థిరాస్తులు. ఇక బంగారం, వెండి, వజ్రాలు… ఇవన్నీ చరాస్తులు. ఇవి కాకుండా స్టాక్స్ ,పిక్స్ డిపాజిట్లు కూడా ఉంటాయి. ఈ ఆస్తులలో ఒక్కో ఆస్తి ఒక్కోరకమైన లాభాలను ఇస్తుంది. మరి వీటిలో ఏది కొనాలి? అంటే మీకు ఆదాయం ఇచ్చే ఆస్తులను ముందు కొనాలి. ఆ తర్వాత మిగిలిన ఆస్తులను కొనండి. మొత్తానికి పైన చెప్పిన ఆస్తులన్నీ కొనండి. ఎందుకంటే ఈ నిలకడ లేని ప్రపంచంలో ఏ రంగం ఎప్పుడు ఊపు అందుకుంటుందో, ఏ రంగం ఎప్పుడు పడిపోతుందో చెప్పడం చాలా కష్టం. అలా అంచనా వేయడానికి మనం ఆర్థికవేత్తలం కాదు కదా!

ఈ విషయంలో వారెన్ బఫెట్ గారు చెప్పిన ఒక మాట మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏమన్నారంటే “అన్ని గుడ్లను ఒకే గంపలో పెట్టొద్దు” అని. దీని అర్థం ఏంటంటే ఒకే గంపలో అన్ని గుడ్లను పెడితే ఆ గంప కింద పడినప్పుడు ఆ గంపలో ఉన్న గుడ్లన్నీ పగిలిపోతాయి. గుడ్లను వేరువేరు గంపల్లో పెడితే ఒక గంప కింద పడినా కూడా మిగిలిన గంపల్లోని గుడ్లు పదిలంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఆయన ఇచ్చిన సలహాని మనమందరం తప్పక పాటించాలి. ఇప్పుడు ఒక్కొక్క ఆస్తి గురించి వివరంగా తెలుసుకుందాం.

బంగారం… ఒక నమ్మకమైన పెట్టుబడి

ఈ మధ్యకాలంలో ప్రపంచంలోని కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు టన్నుల కొద్ది బంగారాన్ని కొంటున్నాయి. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా బంగారాన్ని కొన్నది.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని దేశాల కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం కంటే మన దేశ ప్రజల దగ్గర ఎక్కువ బంగారం ఉందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. బంగారం అంటే మన వాళ్ళకు అంత మోజు. ఎంత పేదవాళ్ళు అయినా సరే వాళ్ల దగ్గర తక్కువలో తక్కువ ఒక తులం బంగారం అయినా ఉంటుంది. దీన్ని బట్టి మన వాళ్లకు బంగారం అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇష్టమే కాదు మన వాళ్లకు బంగారం ఒక నమ్మకమైన పెట్టుబడి.

పెట్టుబడి అని ఎందుకు అంటున్నాను అంటే ఇంట్ల ఏదైనా ఆపతి సాపతి వస్తే ఒంటిమీద ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి డబ్బు తెచ్చుకుంటాం. ఆపద గట్టెక్కిన తర్వాత మళ్లీ ఆ బంగారాన్ని విడిపించుకుంటాం. భూమి కాగితాలు పెట్టుకొని అప్పు ఇవ్వడానికి చాలామంది భయపడతారు. బ్యాంకులు కూడా భూమి మార్కెట్ విలువతో పోలిస్తే చాలా తక్కువ అప్పు ఇస్తాయి. కానీ బంగారాన్ని కుదువ పెట్టుకొని అప్పు ఇవ్వడానికి ఎవ్వరు వెనకాడరు. బ్యాంకులయితే బంగారాన్ని కుదపెట్టుకొని చాలా తక్కువ వడ్డీకే అప్పు ఇస్తాయి. అందుకే ఇది అత్యంత నమ్మకమైన పెట్టుబడి అని అంటున్నాను. సురక్షితమైన పెట్టుబడి కూడా.

ఆడపిల్లల కోసమే బంగారం

మనవాళ్లు ఇంట్ల ఆడపిల్ల పుట్టినప్పటి నుండే ఆమె పెళ్లి కోసం బంగారం కొనడం మొదలుపెడతారు. పైసలున్నప్పుడల్లా ఇంత బంగారం కొనిపెడతారు. మనవాళ్లు ఇంట్ల ఆడపిల్ల పుట్టినప్పటి నుండే ఆమె పెళ్లి కోసం బంగారం కొనడం మొదలుపెడతారు. ఆడపిల్ల పెళ్లి ఈడుకు వచ్చేసరికి ఆమె పెళ్లికి కావాల్సినంత బంగారం జమ చేస్తారు. మనవాళ్లు ఆడపిల్ల పెళ్లంటే చాలా పెద్ద బాధ్యత అని అనుకుంటారు. కాబట్టి అంతే బాధ్యతగా బంగారాన్ని కొంటారు.

సబ్స్క్రైబ్ చేసుకోండి

పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా ఎంత బంగారం పెడుతున్నారు అని అడుగుతారు. మనవాళ్ళ వాళ్లు బంగారానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో దీనిని బట్టి అర్థమవుతుంది.

తక్కువ మిత్తి లేదా వడ్డీకే రుణాలు

బంగారాన్ని బ్యాంకులో కుదువ పెడితే చాలా తక్కువ మిత్తి లేదా వడ్డీకే అప్పు దొరుకుతుంది. అది కూడా ఆ అప్పు నెలనెలా కట్టాల్సిన అవసరం లేదు ఒక సంవత్సరం తర్వాత ఒకేసారి అసలు , వడ్డీ కలిపి కడితే సరిపోతుంది. నేను కూడా మా ఇల్లు కట్టేటప్పుడు పైసల్ లేకపోతే బంగారాన్ని కుదబెట్టి , పైసలు తెచ్చి పూర్తి చేశాను.

పలు రూపాల్లో బంగారం

ఒకప్పుడు బంగారం కేవలం ఫిజికల్ గా మాత్రమే దొరికేది, అంటే భౌతికంగా మనం చూసేది అంటే ఆభరణాలు, గొలుసులు, నగల రూపంలో మాత్రమే దొరికేది. తర్వాత బిస్కెట్ల రూపంలో దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ బంగారం కూడా దొరుకుతుంది.

డిజిటల్ గోల్డ్

ఇప్పుడు చాలా యాప్ల ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనుక్కునే అవకాశం ఉంది. ఫోన్ పే , జార్ యాప్లలో ఇలా డిజిటల్ బంగారాన్ని కొనుక్కోవచ్చు

గోల్డ్ ఈటిఎఫ్ లు

అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా బంగారానికి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి. వాటిని గోల్డ్ ఈటీఎఫ్ లు అని పిలుస్తారు. ఈ గోల్డ్ ఈటీఎఫ్ లను కొనడం మంచిదే, ఇవి చాలా బాగా పెరుగుతాయి. వేర్వేరు కంపెనీల గోల్డ్ ఈటీఎఫ్లు మనకు అందుబాటులో ఉంటాయి.

అయితే బంగారాన్ని ఫిజికల్ బంగారం లేదా నగల రూపంలో కొనుక్కోవడమే మంచిది. ఎందుకంటే బంగారు నగలను ఒంటిమీద వేసుకుంటే సమాజం మనల్ని గౌరవిస్తుంది. అవసరమైనప్పుడు అదే బంగారాన్ని కుదబెట్టి అప్పు తీసుకోవచ్చు. అప్పు తీసుకోవడానికి ఇది చాలా సులభమైన మార్గం.

స్థిరాస్తులను తప్పకుండా కొనండి

స్థిరాస్తులు అంటే భూమి, ప్లాట్, ఇల్లు, అపార్ట్మెంట్… ఇవన్నమాట. వాస్తవానికి వీటిని కొనాలంటే చాలా డబ్బు అవసరం అవుతుంది. కానీ వీటిలో ప్రతి ఒక్కటి మనకు ఆదాయాన్ని ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇవి సమాజంలో మనకు గౌరవాన్ని సంపాదిస్తాయి. ఎందుకంటే సొంత ఊర్లో ఎవరికైనా ఇల్లు ఉంటుంది. అది ఉండగా మీరు హైదరాబాద్లో ఇంకో ఒక జి ప్లస్ త్రీ ఇల్లు కొన్నారు అనుకోండి. అప్పుడు నీ ఊర్లో అందరూ ఫలానా వ్యక్తి హైదరాబాద్లో నాలుగు అంతస్తుల ఇల్లు కొన్నాడని మీ గురించి గొప్పగా చెప్తారు. మిమ్మల్ని చాలా గౌరవిస్తారు కూడా. కాబట్టి స్థిరాస్తులు గౌరవాన్ని పెంచుతాయి.

అన్నింటి నుండి నుండి ఆదాయాన్ని పొందొచ్చు

ఇల్లు, ప్లాట్, అపార్ట్మెంట్లను కిరాయికి ఇవ్వడం ద్వారా మనకు ప్రతినెల ఆదాయం వస్తుంది. అయితే ప్లాట్ ను అయితే లీజుకు ఇవ్వాలి. అది కూడా పట్టణ ప్రాంతాల్లో అయితేనే లీజుకు ఇవ్వగలం. అది కూడా రోడ్డుకు, ఇండ్లకు దగ్గరగా ఉంటేనే ఎవరైనా లీజుకు తీసుకోవడానికి ముందుకు వస్తారు. ప్లాట్ నుండి ఆదాయం రాపట్టుకోవడం కొంచెం కష్టమైన పని.

భూమి ప్రత్యేకమైనది

భూమి మనిషికి ఒక భరోసాని ఇస్తుంది. బ్రతకడానికి ఒక భరోసానిస్తుంది. మీకు ఊళ్లో రెండు ఎకరాల భూమి ఉంది అనుకోండి, మీ గురించి ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు వానికి ఏంట్రా రెండు ఎకరాల భూమి ఉంది కోటీశ్వరుడు అంటారు. ఎందుకంటే భూముల విలువ ఇప్పుడు అలా ఉంది అంతేగాక భూమి ఒక ప్రధాన ఆదాయ వనరు. భూమి ఉంటే బర్రెను, గొర్రెను పెట్టుకొని బతకవచ్చు. భూమి ఉంటే బతుకుదెరువుకు డోకా ఉండదు. ఇక ఊర్లో భూమి ఉంటే నువ్వు రాజు అన్నట్టే.

90 లలో

90లలో భూములు ధరలు చాలా తక్కువ. పది వేలకు, 15 వేలకు ఎకరం భూమి వచ్చేది అప్పుడు. భూమి మీద పెద్దగా ఎవరికి ఆశ ఉండేది కాదు, ఉన్నంతలో మంచిగా బతికితే చాలు అనుకునేవారు. అంటే భూమిని సంపాదించాలన్న కోరిక ఉన్నవాళ్లు లేరని కాదు. అలాంటి వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు భూములు కొనేవారు. కానీ ఎక్కువమంది ఏదో ఒక పని చేసుకుని బతికేవారు. అప్పుడు ధరలు కూడా చాలా తక్కువగా ఉండేవి. పది రూపాయలు పట్టుకొని దుకాణానికి పోయి ఆ రోజుకు సరిపడా కూరగాయలు కొంటే ఇంకా రెండు మూడు రూపాయలు మిగిలేవి. ఐదు పైసలు, పది పైసలకు కూడా చిన్న పిల్లలు తినే వస్తువులు వచ్చేవి. కానీ 2004 వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. ఆ తర్వాత భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.

రియల్ ఎస్టేట్ బూమ్

2004లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చి భూముల రేట్లు ఒకేసారి లక్షల్లోకి వెళ్లిపోయాయి.ఎకరం భూమి రెండు లేదా మూడు లక్షల రూపాయలకు అమ్మారు , కొన్నారు అని తెలిసి చాలా ఆశ్చర్యపోయేవారు. 2004 నుంచి 2015 వరకు భూముల రేట్లు పెరుగుతూనే పోయాయి. ఆ తర్వాత ఎకరం భూమి కోటి రూపాయల వరకు చేరింది. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలు నగరాల్లో ఎకరం విలువ కోట్ల రూపాయలు అయింది. భూముల రేట్లు కోట్లకు పెరిగిపోవడం వల్ల 90 లలో కొని కాపాడుకున్న వాళ్లు ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయారు. అప్పుడు భూముల కొనని వాళ్లు కొని ఉంటే బావుండేదని ఖచ్చితంగా బాధ పడి ఉంటారు.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ వ్యాపారం నుండి మీకు వచ్చే లాభాలు కోట్ల విలువచేసే భూములు కొనడానికి సరిపోకపోవచ్చు. అలా అని భూమి కొనకుండా ఆగిపోవద్దు. మీకు ఎక్కడ తక్కువ ధరకు భూములు దొరికితే అక్కడే కొనాలి. హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో భూములు తక్కువ ధరకు దొరికితే అక్కడే కొనండి. ఆ భూమి రేటు కూడా ఏదో ఒక రోజు పెరుగుతుంది. మీరు కూడా కోటీశ్వరులు అవుతారు.

అప్పుడు మీకు 90 లలో భూములు కొనని వారి లాగా బాధపడాల్సిన అవసరం ఉండదు. కొన్న వారిలాగా మీరు కూడా కోటీశ్వరులు అవుతారు.

ఫామ్ హౌస్ కట్టండి

భూమి నుండి కూడా ఆదాయం వస్తుంది. ఉదాహరణకు మీరు ఒక ఊరిలో 10 ఎకరాల భూమి కొన్నారు అనుకుందాం. ఆ భూమిలో ఫామ్ హౌస్ కట్టారు అనుకుందాం. అందులో వ్యవసాయం చేయండి. బర్లు, ఆవులు పెట్టండి. వ్యవసాయం చేయమని అనడం లేదు, మీరు భూమి కొన్న ఊర్లో వ్యవసాయం పనులు తెలిసిన ఒక వ్యక్తిని చూసి మీ ఫామ్ హౌస్ లో అతనికి ఉద్యోగం ఇవ్వండి, అంటే అతని జీతం ఉంచుకోండి. అతని చేత వ్యవసాయం పనులు అన్ని చేయించండి. అతనికి ప్రతినెల కొంత జీతం ఇవ్వండి ఎలాగో వ్యవసాయం మీద వచ్చే ఆదాయంపై పన్ను పడదు, కాబట్టి ఇక్కడ డబ్బంతా మీదే. ప్రతినెల ఆవుల, బర్ల పాల మీద వచ్చే పాల బిల్లు నుండి అతనికి జీతాన్ని చెల్లించండి.

ఇలా ఇండ్లు, ప్లాట్లు, భూమి, అపార్ట్మెంట్లు కొనడం వల్ల వాటి నుంచి నిరంతరం నీతో ఆదాయం వస్తుంది.

దీర్ఘ కాలానికి స్టాక్స్ చాలా మంచివి

“స్టాక్ మార్కెట్ అనేది ఓపిక లేని వారి నుండి ఓపిక ఉన్నవారికి డబ్బు సరఫరా చేసే ఒక పరికరం” అన్నాడు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్.

ఎందుకంటే స్టాక్ మార్కెట్ దీర్ఘ కాలంలో చాలా మంచి లాభాలను ఇస్తుంది. దీర్ఘకాలం అంటే 20,30,40,50….. సంవత్సరాల కాలం అన్నమాట. కాబట్టి అన్ని సంవత్సరాలు ఓపికగా ఉంటే మీకు మంచి లాభాలు వస్తాయి. మంచి కంపెనీల స్టాక్స్ కొని ఎక్కువకాలం ఉంచుకోవడమే మనం చేయవలసిన పని.

వారెన్ బఫెట్ గారు 60 ఏళ్ల వయసులో ధనవంతులు అయ్యాడు. 2008లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా చరిత్ర సృష్టించాడు. కానీ ఆయన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది ఎప్పుడో తెలుసా? తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. ఆపిల్, గూగుల్, కోకా కోలా వంటి కంపెనీల స్టాక్స్ కొని, ఎక్కువకాలం ఓపికతో తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ కంపెనీలు పెరిగాయి, వాటి స్టాక్ విలువ కూడా పెరిగింది, వారెన్ బఫెట్ గారు కూడా ధనవంతులు అయ్యారు. కాబట్టి స్టాక్స్ దీర్ఘకాలంలో చాలా మంచివి.

వేర్వేరు రంగాల్లోని కంపెనీల షేర్లను కొనండి

ఓకే రంగంలోని ఉన్న కంపెనీల షేర్లు కానీ ఒకే గ్రూప్ కు సంబంధించిన కంపెనీల షేర్లు మాత్రమే కొనాలని ఎప్పుడు అనుకోవద్దు. మీరు పెట్టుబడి పెట్టిన రంగం లేదా ఆ గ్రూప్ కు చెందిన కంపెనీలు ఏదైనా విపత్తు వచ్చి పతనమవ్వవచ్చు. అప్పుడు నీ పెట్టుబడి మొత్తం పోతుంది. కాబట్టి వేర్వేరు రంగాల్లోని మంచి కంపెనీలను ఎంచుకొని వాటి స్టాక్స్ కొని మీ పెట్టుబడికి భద్రత కల్పించండి.

ఐటి, ఫార్మా, లోహ, బ్యాంకింగ్, వాహన, ఎఫ్ఎంసీజీ, హోటల్స్, టెక్స్టైల్, శక్తి, హోల్డింగ్…. ఇలా రకరకాల రంగాల కంపెనీల షేర్లు కొనండి అప్పుడు ఏదైనా ఒక రంగం పడిపోయిన పడిపోయినా మిగతా రంగాల షేర్లు లాభాల్లో ఉంటాయి.

ఇప్పుడు మీకు ఎలాంటి ఆస్తులు కొనాలన్న దానిపై అవగాహన వచ్చింది అనుకుంటా. ఇక ఆస్తులు కొనడంపై దృష్టి పెట్టండి. ధన్యవాదాలు తర్వాత కమ్మలో కలుద్దాం, ధన్యవాదాలు.

Leave a Comment